Pakistan: పాక్ యూనివర్సిటీ సంచలన నిర్ణయం.. ప్రేమికుల దినోత్సవాన్ని ‘సిస్టర్స్ డే’గా జరుపుకోనున్న వర్సిటీ

  • వాలైంటైన్స్ డే బదులు సిస్టర్స్ డే జరుపుకోండి
  • మన నాగరికతలోకి పాశ్చాత్య సంస్కృతి ప్రవేశిస్తోంది
  • అక్కాచెల్లెళ్లుగా వారికి లభిస్తున్న గౌరవం అపారం

ఫిబ్రవరి 14న నిర్వహించుకునే ప్రేమికుల దినోత్సవం (వాలంటైన్స్ డే)ను సోదరీమణుల దినోత్సవం (సిస్టర్స్ డే)గా జరుపుకోవాలని పాకిస్థాన్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్, ఫైసలాబాద్ (యూఏఎఫ్) నిర్ణయించింది. యువతలో తూర్పుదేశాల సంస్కృతి, ఇస్లాం సంప్రదాయాలను పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ జాఫర్‌ ఇక్బాల్‌ రణ్‌ధవా పేర్కొన్నారు.

‘‘మన సంస్కృతీ సంప్రదాయాలలో మహిళలకు చాలా గౌరవం ఉంది. వారు చాలా సాధికారత కలిగిన వారు. అక్కాచెల్లెళ్లుగా, తల్లులుగా, కుమార్తెలుగా, భార్యలుగా గౌరవం అందుకుంటున్నారు. మనం మన సంస్కృతీ సంప్రదాయాలను క్రమంగా మర్చిపోతున్నాం. పాశ్చాత్య సంస్కృతి మన మూలాల్లోకి చొరబడుతోంది’’ అని జాఫర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 14న మహిళలకు స్కార్ఫ్‌లు, అక్కాచెల్లెళ్లకు దుస్తులు బహూకరించాలని పిలుపునిచ్చారు.

More Telugu News