Gujarat: గుజరాత్‌లో నేటి నుంచే 'ఈబీసీ పది శాతం' కోటా అమలు.. తొలి రాష్ట్రంగా రికార్డు!

  • ప్రకటించిన ముఖ్యమంత్రి విజయ్ రూపానీ
  • విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్
  • ఇటీవలే చట్టంగా మారిన బిల్లు

అగ్రవర్ణాలలోని ఆర్థిక బలహీన వర్గాలకు పదిశాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన చారిత్రక బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడడంతో చట్టంగా మారింది. ఇప్పుడీ చట్టం విషయంలో గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నేటి నుంచే ఈ చట్టాన్ని అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తెలిపారు.

త్వరలో భర్తీ చేయనున్న ప్రభుత్వ ఉద్యోగాలతోటు విద్యాసంస్థల్లోనూ ఈబీసీలకు పదిశాతం రిజర్వేషన్ కల్పిస్తామని పేర్కొన్నారు. ఫలితంగా ఈ చట్టాన్ని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా గుజరాత్ రికార్డులకెక్కనుంది. నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఈ బిల్లు లోక్‌సభ, రాజ్యసభల్లో పెద్దగా అడ్డంకులు లేకుండానే ఆమోదం పొందింది. ఉభయ సభల్లోనూ ఆమోదం పొందిన ఈ బిల్లును రెండు రోజుల క్రితం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదించడంతో చట్టంగా మారింది.

More Telugu News