SCR: సికింద్రాబాద్ నుంచి రూ. 130తో విజయవాడకు, రూ. 175తో కాకినాడ నుంచి తిరుపతికి... స్పెషల్ జనసాధారణ్ రైళ్ల వివరాలివి!

  • 7 రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
  • సాధారణ టికెట్ చార్జీతోనే ప్రయాణం
  • అన్ని బోగీలూ అన్ రిజర్వుడే!

పండగ పూట సొంత ఊర్లకు వెళ్లాలని భావిస్తూ, ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడును తట్టుకోలేని సామాన్యులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను వినిపించింది. రద్దీ దృష్ట్యా, 7 జన్ సాధారణ్ ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాంతాల మధ్య నేటి నుంచి తిప్పనుంది. సాధారణ రైలు చార్జీలతో ఈ రైళ్లలోని ఏ బోగీలో అయినా కూర్చుని ప్రయాణించవచ్చు. సికింద్రాబాద్ - విజయవాడ మధ్య (07192) నేటి మధ్యాహ్నం 12 గంటలకు, విజయవాడలో నేటి రాత్రి 8.25 కు హైదరాబాద్ కు (07193) రైలు బయలుదేరుతాయి.

నేటి మధ్యాహ్నం మరో రైలు (07194) 1.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. ఇదే రైలు విజయవాడలో (07195) రేపు ఉదయం 8.35కు సికింద్రాబాద్ కు బయలుదేరుతుంది. నేటి సాయంత్రం కాకినాడ టౌన్ నుంచి తిరుపతికి (07191) సాయంత్రం 6.45కు ఓ రైలు బయలుదేరుతుంది. రాత్రి 9.10 గంటలకు (07184) రైలు విజయవాడ నుంచి విజయనగరానికి బయలుదేరుతుంది. విజయనగరం నుంచి ఇదే రైలు (07185) రేపు ఉధయం 7.45కు విజయవాడకు బయలుదేరుతుంది.

ఇక ఈ రైళ్లలో సికింద్రాబాద్ నుంచి విజయవాడకు రూ. 130, విజయవాడ నుంచి హైదరాబాద్ కు రూ. 135, కాకినాడ నుంచి తిరుపతికి రూ. 175, విజయనగరం, విజయవాడ మధ్య ప్రయాణానికి రూ. 145 రూపాయల టికెట్ ధరను నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు.

More Telugu News