Kesara: కదలని వాహనాలు... కీసర వద్ద ఐదు కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్!

  • బిజీగా మారిన జాతీయ రహదారులు
  • కీసర వద్ద ఆగున్న 5 వేల వాహనాలు
  • నెమ్మదిగా కదులుతున్న వాహనాలు

సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణికులతో బయలుదేరిన వాహనాలతో జాతీయ రహదారి బిజీగా మారగా, కీసర టోల్ గేటు వద్ద సుమారు 5 వేలకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. టోల్ గేటు నుంచి 5 కిలోమీటర్ల వరకూ వాహనాలు ఆగిపోయాయి. టోల్ టాక్స్ ను రద్దు చేస్తున్నామని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రకటించినప్పటికీ, తమకు కేంద్రం నుంచి ఆదేశాలు రాలేదని చెబుతున్న టోల్ గేటు సిబ్బంది, ముక్కుపిండి మరీ ఫీజులను వసూలు చేస్తున్నారు.

ప్రతి వాహనంలోని ప్రయాణికులూ టోల్ గేటు సిబ్బందితో వాగ్వాదానికి దిగుతుండటంతో, చాలా నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. నిన్నటి నుంచి ఇప్పటివరకూ దాదాపు 15 వేల వాహనాలు గేట్ ను దాటాయి. తెలుగు రాష్ట్రాల్లోని జాతీయ రహదారులపై ఉన్న మిగతా టోల్ గేట్ల వద్ద కూడా ఇటువంటి పరిస్థితులే నెలకొనివున్నాయి.

More Telugu News