Donald Trump: ట్రంప్ నోట కొత్త మాట... అమెరికా వెళ్లాలనుకునేవారికి శుభవార్త!

  • హెచ్-1బీ వీసా జారీ నిబంధనల్లో మార్పులు
  • పౌరసత్వానికి సంభావ్య మార్గం తీసుకురానున్నాం
  • ట్విట్టర్ లో వెల్లడించిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా వెళ్లాలని భావించేవారికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుభవార్తను చెప్పారు. హెచ్-1బీ వీసా జారీ నిబంధనల్లో మార్పులు చేయనున్నట్టు ఆయన తెలిపారు. టెక్నాలజీ, ఆరోగ్య రంగంలో నిపుణులై, తమ దేశానికి రావాలని భావించే ఉన్నత విద్యావంతులకు తాత్కాలికంగా వీసాలను మంజూరు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు.

"యునైటెడ్ స్టేట్స్ లో హెచ్-1బీ వీసాదారుల పౌరసత్వానికి సంభావ్య మార్గం తీసుకురానున్నాము. వీసా విధానం సరళతరం అవుతుంది. కచ్చితత్వం ఉంటుంది. అతి త్వరలోనే మార్పులు జరుగుతాయని హామీ ఇస్తున్నా" అని ఆయన అన్నారు. అమెరికాలో తమ కెరీర్ వృద్ధిని కోరుకునే ప్రతిభావంతులను, అత్యంత నైపుణ్యం గల వ్యక్తులను ప్రోత్సహిస్తానని తెలిపారు.

కాగా, ఆయన తన ట్వీట్ లో "పౌరసత్వానికి సంభావ్య మార్గం" (potential path to citizenship) అని వ్యాఖ్యానించగా, ఇది అస్పష్టంగా ఉందని పలువురు వ్యాఖ్యానించారు. ఇక గడచిన డిసెంబర్ లో యూఎస్ సీఐఎస్ (యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్) విడుదల చేసిన వీసా నిబంధనలను మరోసారి మార్చనున్నారా? అన్న విషయంపై వైట్ హౌస్ స్పందించాల్సివుంది.




More Telugu News