America: ప్రపంచబ్యాంక్ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ఇవాంక ట్రంప్.. పోటీలో నిక్కీ హేలీ కూడా

  • అధ్యక్ష పదవి నుంచి వైదొలగనున్న జిమ్
  • పోటీలో అమెరికాయేతరులు కూడా
  • ప్రపంచబ్యాంకులో అత్యధిక వాటా అగ్రరాజ్యానిదే

ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత అధిపతి జిమ్ యంగ్ కిమ్ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పదవి నుంచి వైదొలగనున్న నేపథ్యంలో కొత్త అధిపతి కోసం అన్వేషణ మొదలైంది. ఈ పదవి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ పోటీ పడుతున్నారు. ఆమెతోపాటు డేవిడ్ మల్పాస్, నిక్కీ హేలీ వంటి హేమాహేమీలు కూడా పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇతర దేశాలకు చెందిన వారు కూడా పోటీలో ఉన్నప్పటికీ, అమెరికా మద్దతు ఉన్నవారికే ఈ పదవి దక్కుతుంది. ఎందుకంటే ప్రపంచ బ్యాంకులో అత్యధిక వాటా అమెరికాదే! కాగా, పదవి నుంచి వైదొలగనున్న జిమ్ యంగ్ కిమ్ మరో ప్రైవేటు సంస్థలో కీలక బాధ్యతలు చేపట్టనున్నారు.

More Telugu News