కూలిన శ్రీశైల మల్లన్న ఆలయ ప్రాకారం

13-01-2019 Sun 06:25
  • భ్రమరాంబ ఆలయ ప్రాకారం ఎత్తు పెంచే పనులు
  • రాళ్ల అధిక బరువు వల్ల స్వల్పంగా కూలిన ప్రాకారం
  • ఇటీవల మల్లన్న సన్నిధిలో క్షుద్రపూజల ఆరోపణలు
కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని మల్లికార్జునస్వామి ఆలయ ప్రాకారం శనివారం రాత్రి స్వల్పంగా కూలిపోయింది. ప్రస్తుతం భ్రమరాంబదేవి ఆలయ నైరుతి భాగంలో ప్రాకారం ఎత్తు పెంచే పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాళ్ల అధిక బరువు కారణంగా ప్రాకారం పది అడుగుల మేర కూలింది. కాగా, ఆలయంలో ఇటీవల క్షుద్రపూజలు నిర్వహించారంటూ కలకలం రేగింది. మల్లన్న సన్నిధిలో అర్ధరాత్రి వేళ క్షుద్ర పూజలు చేస్తున్నారన్న ఆరోపణలపై వేదపండితుడు గంటి రాధాకృష్ణను ఈవో సస్పెండ్ చేశారు.