Andhra Pradesh: మేము చేసినన్ని సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణలో కేసీఆర్ చేయగలిగారా?: సీఎం చంద్రబాబు

  • రైతులకు, డ్వాక్రా సంఘాలకు.. మేము బాగా ఇచ్చాం
  • అదే, తెలంగాణలో ఈ విధంగా కేసీఆర్ ఇవ్వలేదు
  • ఏపీలో క్యాంటీన్లకు, ఇతర రాష్ట్రాల్లో క్యాంటీన్లకు పోలిక లేదు

ఏపీలో తాము చేసినన్ని సంక్షేమ కార్యక్రమాలను మిగులు బడ్జెట్ రాష్ట్రమైన తెలంగాణలో సీఎం కేసీఆర్ చేయగలిగారా? అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. అమరావతిలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో రైతులకు, డ్వాక్రా సంఘాలకు, పింఛన్ దారులకు తాము బాగా ఇచ్చామని, అదే, తెలంగాణలో ఈ విధంగా కేసీఆర్ ఇవ్వలేదని అన్నారు.

ఏపీలో సిమెంట్ రోడ్లు, అన్ని ఇళ్లకు మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా, గ్యాస్ సౌకర్యం తాము కల్పించామని, అభివృద్ధి చెందిన, ధనిక రాష్ట్రాలు కూడా ఇవ్వలేని విధంగా తమ ప్రజలకు సౌకర్యాలు కల్పించానని అన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద రూ.5 లక్షలు ఇస్తున్నామని, ‘రక్ష’ కింద బాలికలకు శానిటరీ నేప్కిన్స్ ఇస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఏపీలో క్యాంటీన్లకు, ఇతర రాష్ట్రాల్లో క్యాంటీన్లకు ఎటువంటి పోలికా లేదని చెప్పారు. ‘ఒక నమ్మకం, ఒక విశ్వాసం.. అదే అమరావతి.. ఒక ప్రజా రాజధానికి శ్రీకారం చుట్టాం. అది మా నిబద్ధత’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

More Telugu News