Andhra Pradesh: ఏపీలో జరిగిన ఘటనలపై ఇక్కడ కేసులు పెట్టకుండా పాకిస్థాన్ లో పెడతారా?: సీఎం చంద్రబాబు

  • ప్రతిపక్ష నేత జగన్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు
  • రాష్ట్ర పోలీసులకు కనీసం ఫిర్యాదు కూడా చేయని వ్యక్తి!
  • వ్యవస్థలపై గౌరవం లేకపోతే పాకిస్థాన్, అమెరికా పోయి ఫిర్యాదు చేసి వస్తారా?

ప్రతిపక్ష నేత జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో దాడి కేసును కేంద్రం ఎన్ఐఏ కు అప్పగించడంపై కోర్టులో పోరాడతామని, ఏపీలో జరగిన ఘటనపై ఇక్కడ కేసులు పెట్టకుండా పాకిస్థాన్ లో పెడతారా? కేంద్ర ప్రభుత్వంపై నమ్మకం లేదని, అమెరికాకు వెళ్తామంటే ఊరుకుంటారా? అని సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. అమరావతిలో ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఎయిర్ పోర్ట్ భద్రత కేంద్రానిదే కానీ, ఈ కేసుకు సంబంధించిన విచారణ, దర్యాప్తు అధికారం రాష్ట్రానివేనని అన్నారు.

'రాష్ట్ర పోలీసులకు కనీసం ఫిర్యాదు కూడా చేయని వ్యక్తికి కేంద్రం ఎలా ఆశ్రయం ఇస్తుంది? వ్యవస్థలపై గౌరవం లేకపోతే పాకిస్థాన్, అమెరికా పోయి ఫిర్యాదు చేసి వస్తారా?’ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపైనా ఆయన నిప్పులు చెరిగారు. అవినీతి ఆరోపణలు ప్రధానిపై లేవా? రాఫెల్ కుంభకోణం మాటేంటి? బీజేపీతో కలిసి ఉన్నంత వరకూ తమపై దాడులు చేయలేదని అన్నారు. బీజేపీని ప్రశ్నిస్తే అకస్మాత్తుగా తాము, తమ ఎంపీలు, ఎమ్మెల్యేలు అవినీతిపరులమైపోయామా? అంటూ మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

More Telugu News