akhilesh yadav: అఖిలేష్, మాయావతిలది అపవిత్ర కలయిక: యోగి ఆదిత్యనాథ్

  • సరైన సమయంలో ప్రజలు సరైన సమాధానం చెబుతారు
  • వైరి పార్టీల మధ్య కూటమి ఏర్పడటం విచిత్రంగా ఉంది
  • 2014 కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తాం

ఉత్తరప్రదేశ్ లో వైరి పక్షాలైన ఎస్పీ, బీఎస్పీలు కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. కూటమి ఏర్పాటుకు సంబంధించి ఈ ఉదయం అఖిలేష్ యాదవ్, మాయావతిలు సంయుక్త ప్రకటన చేశారు. ఈ కూటమిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శలు గుప్పించారు. వీరిది ఒక అపవిత్ర, అవినీతి, అవకాశవాద కూటమని ఆయన విమర్శించారు. ఎస్పీ, బీఎస్పీలకు రాష్ట్ర అభివృద్ధి, మంచి పాలన అవసరం లేదని అన్నారు. వీరి అపవిత్ర కూటమి గురించి ప్రజలకు తెలుసని... సరైన సమయంలో, సరైన సమాధానాన్ని జనాలు చెబుతారని తెలిపారు.

పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పార్టీల మధ్య కూటమి ఏర్పడటం విచిత్రంగా ఉందని యోగి అన్నారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి కూటమి ఏర్పడినా... 2014 ఎన్నికలకంటే మెరుగైన ఫలితాలను తాము సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఉదయం మాయావతి మాట్లాడుతూ, ఇక నుంచి మోదీ, అమిత్ షాలు నిద్రలేని రాత్రులను గడపబోతున్నారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

More Telugu News