Nani: 'జెర్సీ' నుంచి టీజర్ రిలీజ్ .. ప్రయత్నిస్తే ఓడిపోయినవాడు లేడంటోన్న నాని

  • క్రికెట్ నేపథ్యంలో సాగే కథాకథనాలు
  • కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్
  • ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు   

నాని కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'జెర్సీ'సినిమా రూపొందుతోంది. నాని క్రికెటర్ గా అర్జున్ పాత్రలో కనిపించే ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం టీజర్ ను రిలీజ్ చేశారు. క్రికెటర్ గా తాను అనుకున్న స్థానానికి చేరుకోవడానికి నాని పడిన కష్టం .. నిరుత్సాహ పరిచే మాటలను అధిగమించిన తీరు .. తాను అనుకున్న స్థాయికి చేరుకుని పొందిన ఆనందం ఈ టీజర్లో చూపించారు.

'ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు గానీ .. ప్రయత్నిస్తే ఓడిపోయినవాడు లేడు' అనే డైలాగ్ చాలా బాగుంది. కథ అంతా కూడా క్రికెట్ నేపథ్యంలోనే కొనసాగుతుందనే విషయం ఈ టీజర్ వలన అర్థమవుతోంది. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తన కెరియర్లో చెప్పుకోదగినదిగా ఈ సినిమా నిలిచిపోతుందని నాని భావిస్తున్నాడు.

More Telugu News