Chandrababu: రెండు కీలకమైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు

  • కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన
  • రూ. 1387 కోట్లతో నిర్మాణం
  • రూ. 750 కోట్లతో వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ కు శంకుస్థాపన

ఏపీలో మరో రెండు కీలకమైన ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఉదయం శంకుస్థాపన చేశారు. విజయవాడ ఇబ్రహీంపట్నం పవిత్రసంగమం వద్ద కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 3.2 కిలోమీటర్ల పొడవుతో రూ. 1387 కోట్లతో ఈ బ్రిడ్జిని నిర్మించనున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి అమరావతిలోని ఉద్ధండరాయునిపాలెంను ఈ వంతెన కలుపుతుంది. ఎల్ అండ్ టీ సంస్థ ఈ వంతెనను నిర్మిస్తోంది. దీంతో పాటు రూ. 750 కోట్లతో వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ కు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. <blockquote class="twitter-tweet" data-lang="en"><p lang="te" dir="ltr">రాజధాని పరిధిలో మరో సుందర నిర్మాణం.. కృష్ణానదిపై పవిత్ర సంగమాన్ని అమరావతితో కలుపుతూ.. అత్యాధునిక వంతెనకు శ్రీకారం.. <a href="https://t.co/GMSLRkJurp">pic.twitter.com/GMSLRkJurp</a></p>— N Chandrababu Naidu (@ncbn) <a href="https://twitter.com/ncbn/status/1084010225093402626?ref_src=twsrc%5Etfw">January 12, 2019</a></blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

More Telugu News