paruchuri: 'కథానాయకుడు'లో కొన్ని సంఘటనలు ఎందుకు వదిలేశారని క్రిష్ ను అడిగాను: పరుచూరి గోపాలకృష్ణ

  • అన్నగారితో 14 యేళ్ల అనుబంధం
  •  కొన్ని సంఘటనలు వదిలేశారు
  • క్రిష్ చెప్పిన కారణం అది

'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ 'కథానాయకుడు' సినిమాను గురించి ప్రస్తావించారు. "అన్నగారితో 14 సంవత్సరాలపాటు కలిసి ప్రయాణించాను. ఆయనను చాలా దగ్గరగా చూసిన వాళ్లలో నేనూ ఒకడిని. అన్నగారి జీవితంలో అనేక కోణాలు వున్నాయి. నాకు తెలిసి కొన్ని సంఘటనలను వదిలేశారు. ఇదే విషయాన్ని నేను క్రిష్ కి ఫోన్ చేసి అడిగాను.

బాలయ్య బాబుగారు ఒకటే చెప్పారండి .. 'నా తండ్రి జీవితచరిత్ర చూసి ఎవరూ కూడా నెగెటివ్ గా థింక్ చేయకూడదు. పాజిటివ్ వే లోనే సినిమా చూసి బయటికి వెళ్లాలి' అన్నారు. అందువలన కొన్ని సంఘటనలను మేము తీసుకోలేదండి అన్నారు. అన్నగారికి జరిగిన అన్యాయం తాలూకు సీన్స్ గానీ .. మరో మనిషి ఇన్వాల్వ్ అయ్యే సీన్స్ గాని వద్దనుకున్నారు. అందుకే ఆ సీన్స్ ను టచ్ చేయలేదు. ఏదేవైనా ఇంతగొప్ప సినిమా తీసిన బాలకృష్ణ జన్మ ధన్యమైందనే చెప్పాలి' అని అన్నారు. 

More Telugu News