paruchuri: ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు: పరుచూరి గోపాలకృష్ణ

  • ఆ సినిమాతో అన్నగారి అభిమానినయ్యాను
  • నా గొంతూ .. గుండె రెండూ పట్టేశాయి
  • బాలకృష్ణ పరకాయ ప్రవేశం చేశారు    

తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, ఎన్టీఆర్ బయోపిక్ ను గురించి ప్రస్తావించారు. 'సీతారామ కల్యాణం' సినిమాతో నేను ఎన్టీఆర్ గారి అభిమానిగా మారిపోయాను. తెరపై దశకంఠుడిగా కనిపించడానికి ఆయన ఎన్ని గంటల పాటు కష్టపడ్డారనేది చూసిన తరువాత నా గొంతూ .. గుండే రెండూ పట్టేశాయి. 'కథానాయకుడు' చూస్తున్నంత సేపు ఇది సినిమా అనే విషయాన్ని మేము మరిచిపోయాము.

ఎన్టీఆర్ గారి వైభవం మొదలైన తరువాత స్క్రీన్ ప్లే చాలా కష్టం .. ఎందుకంటే ఆయన ప్రయాణం కేవలం సినిమాలకి సంబంధించి మాత్రమే కొనసాగింది. రామారావుగారి వ్యక్తిత్వాన్ని ఈ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించారు. రిజిస్ట్రార్ గా పనిచేసే రామారావు ఎందుకు రాజీనామా చేశారు? ఇంట్లో వాళ్లకి ఎవరికీ ఇష్టం లేకపోయినా ఎందుకు సినిమాల్లోకి వచ్చారు? బసవతారం ఇచ్చిన కాసుల పేరు ఏం చేశారు? తన ఆకలిని చంపుకుని ఇతరులకి ఎలా సాయం చేశారు? అనేవి అద్భుతంగా చూపించారు. ఇక అన్నగారి పాత్రలోకి బాలకృష్ణ పరకాయ ప్రవేశం చేశారనే చెప్పాలి" అన్నారు. 

More Telugu News