India: మా అమ్మ అంతగా చదువుకోనప్పటికీ మంచి తెలివి తేటలున్నాయి: ప్రధాని మోదీ

  • మా అమ్మకు వైద్య మెళకువలు తెలుసు
  • తన పూర్వీకుల నుంచి అవి సంక్రమించాయి
  • చిన్న పిల్లలకు వచ్చిన జబ్బులను నయం చేసేది

ప్రధాని మోదీ తన చిన్నతనం నాటి విషయాలను గుర్తుచేసుకున్నారు. ఎంతో ఆసక్తి గొలుపుతున్న ఈ విషయాల గురించి ఓ సందర్భంలో మోదీ ప్రస్తావించారు. ‘హ్యుమన్స్ ఆఫ్ బాంబే’’ అనే ఫేస్ బుక్ పేజ్ నిర్వాహకులతో ఆయన తాజాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా తన తల్లి హీరాబెన్ మోదీ గొప్పతనం గురించి గుర్తు చేసుకున్నారు.

అమ్మ వైద్యం కోసం బారులు తీరేవారు: 
మా అమ్మకు తన పూర్వీకుల నుంచి సంక్రమించిన వైద్య మెళకువలతో, సంప్రదాయ పద్ధతుల ద్వారా చిన్న పిల్లలకు వచ్చిన జబ్బులను నయం చేసేది. ఆమె అంత బాగా చదువుకోకపోయినప్పటికీ ఆ దేవుడు మంచి తెలివితేటలిచ్చాడు. ఆమె చేసే వైద్యం కోసం తమ పిల్లలతో ఎంతో మంది తల్లులు మా ఇంటి ముందు ఉదయానికల్లా బారులు తీరి ఉండేవారు.

More Telugu News