sarada chit funds: శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో చిదంబరం భార్యపై కేసు నమోదు

  • కోల్ కతాలోని ప్రత్యేక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు
  • సుదీప్తా సేన్, ఇతర నిందితులతో కలిసి నళినీ కుట్ర 
  • సుదీప్తా కంపెనీ ద్వారా రూ.1.4 కోట్లు ఆమె తీసుకున్నట్టు ఆరోపణలు 

చిట్ ఫండ్ కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం భార్య నళినీపై సీబీఐ ఛార్జిషీట్ నమోదైంది. ఈ విషయాన్ని సీబీఐ ప్రతినిధి అభిషేక్ దయాళ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శారదా గ్రూప్ ప్రొప్రయిటర్ సుదీప్తా సేన్, ఇతర నిందితులతో కలిసి నళినీ చిదంబరం నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు.

కేంద్ర మాజీ మంత్రి మాతంగ్ సిన్హ్ పై ఉన్న సెబీ, ఆర్వోసీ వంటి వివిధ సంస్థల దర్యాప్తులను లేకుండా చేయాలని ఆయన మాజీ భార్య మనోరంజన్ సిన్హ్ భావించారని, ఈ క్రమంలోనే సుదీప్తా సేన్ కు నళినీ చిదంబరంను పరిచయం చేసినట్టు చెప్పారు. సుదీప్తా సేన్ కంపెనీ ద్వారా నళినీ చిదంబరం రూ.1.4 కోట్లు అందుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయని అభిషేక్ దయాళ్ వివరించారు. కోల్ కతాలోని ప్రత్యేక కోర్టులో ఆమెపై ఈ ఛార్జిషీట్ దాఖలు చేసినట్టు చెప్పారు.

More Telugu News