Mobiistar X1 Notch: మోబిస్టార్ ఎక్స్1 నాచ్ స్మార్ట్ ఫోన్ విడుదల.. రూ.2200 క్యాష్ బ్యాక్ ప్రకటించిన జియో

  • భారత్ లో విడుదలైన మోబిస్టార్ ఎక్స్1 నాచ్ స్మార్ట్ ఫోన్ 
  • రెండు వేరియంట్లలో లభ్యం 
  • 2 జీబీ ర్యామ్ ఫోన్ ధర రూ.8499, 3 జీబీ ర్యామ్ ఫోన్ ధర రూ.9,499

వియత్నాం మొబైల్ తయారీదారు మోబిస్టార్ తాజాగా భారత మార్కెట్లో నూతన స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. 2 జీబీ/3 జీబీ ర్యామ్ వేరియంట్లలో 'మోబిస్టార్ ఎక్స్1 నాచ్' లభ్యం కానుంది. నాచ్ స్పోర్ట్స్ 5.7" డిస్ప్లే , 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లాంటి ఫీచర్లని కలిగి ఉన్న ఈ ఫోన్ గ్రేడియంట్ షైన్, మిడ్నైట్ బ్లాక్, సఫైర్ బ్లూ అనే రంగులలో అందుబాటులో ఉండనుంది. 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఫోన్ ధర రూ.8,499 ఉండగా, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఫోన్ ధర రూ.9,499గా ఉంది. కొత్తగా లాంచ్ చేసిన మోబిస్టార్ డివైస్ లతో జియో రూ.2200 క్యాష్ బ్యాక్ ప్రకటించింది.

More Telugu News