TRS: తెలంగాణ ఎన్నికల సంఘం అధికార పార్టీకి తొత్తుగా మారింది: మర్రి శశిధర్ రెడ్డి ఆరోపణ

  • సరైన ఓటర్ల జాబితా తయారు చేసే చిత్తశుద్ధి లేదు
  • తప్పులకు కారణమైన అధికారులపై చర్యలేవి?
  • సీఈసీ కూడా టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తోంది

తెలంగాణలో అధికార పార్టీకి తొత్తుగా రాష్ట్ర ఎన్నికల సంఘం మారిందని, సరైన ఓటర్ల జాబితాను తయారు చేసే చిత్తశుద్ధి ఈసీకి లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓటర్ల జాబితాలో తప్పులు జరిగాయని చెప్పిన ఎన్నికల సంఘం, ఆ తప్పులకు కారణమైన అధికారులపై ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేశారో చూశామని, దీని గురించి అన్ని పార్టీలకు వివరిస్తామని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కూడా టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తోందని శశిధర్ రెడ్డి ఆరోపించారు.

More Telugu News