Andhra Pradesh: శభాష్.. 30 ఏళ్ల చరిత్రను మూడు గంటల్లో చూపారు!: క్రిష్ బృందానికి చంద్రబాబు ప్రశంసలు

  • విలువలతో రాజీపడలేక ఎన్టీఆర్ ఉద్యోగం వదిలేశారు
  • జోలె పట్టి విరాళాలు సేకరించారు
  • ఎన్టీఆర్ ను గుర్తుచేసుకున్న చంద్రబాబు

తన విలువలు, భావాలతో రాజీపడలేక ఎన్టీఆర్ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సినీ నటుడు అయినప్పటికీ ప్రజల కోసం జోలె పట్టి విరాళాలు స్వీకరించారనీ, సొంతంగా విరాళం ఇచ్చి స్ఫూర్తిని నింపారని గుర్తుచేశారు. నిన్న రాత్రి ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ సినిమాను చంద్రబాబు వీక్షించారు. అమరావతిలో టీడీపీ నేతలతో ఈరోజు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఈ సినిమాను ప్రస్తావించారు.

ఎన్టీఆర్ 30 ఏళ్ల చరిత్రను దర్శకుడు క్రిష్, చిత్ర యూనిట్ 3 గంటల్లో చూపిందని చంద్రబాబు ప్రశంసించారు. ప్రభుత్వాలకు, సినీ నటులకు, సమాజ సేవకులకు ఎన్టీఆర్ కితాబు ఇచ్చారని ప్రశంసించారు. తుపాను బాధితులను ఆదుకోవడాన్ని ఎన్టీఆరే నేర్పించారని సీఎం వెల్లడించారు. తాను గుడిసెలో నివసించే నిరుపేదల బాధలు చూశాననీ, అందుకే పేదలందరికీ కాంక్రీట్ శ్లాబుతో పక్కా ఇళ్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.

More Telugu News