Andhra Pradesh: కరెంట్ బిల్లులు సైతం కట్టలేకపోయిన జగన్.. తండ్రి సీఎం అయ్యాక 36 ఎకరాల్లో భవనాన్ని ఎలా నిర్మించారు?: ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి

  • ఏపీకి అన్యాయంపై జగన్ స్పందించడం లేదు
  • కేసుల కోసం మోదీకి అమ్ముడుపోయారు
  • కర్నూలులో మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా, విభజన హామీల అమలులో అన్యాయం జరుగుతున్నా జగన్ ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించడం లేదని ఏపీ డిప్యూటీ సీఎం, టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తి నిలదీశారు. కేసుల మాఫీ కోసమే జగన్ మోదీ చేతుల్లో కీలుబొమ్మగా మారారని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి ఓ అవినీతి చక్రవర్తి అని కేఈ విమర్శించారు. కర్నూలులో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కేసుల నుంచి బయటపడటానికి జగన్ మోదీకి అమ్ముడుపోయారని కేఈ కృష్ణమూర్తి ఆరోపించారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఏపీ ముఖ్యమంత్రి కాకముందు జగన్ కరెంట్ బిల్లులు కూడా కట్టలేని స్థితిలో ఉండేవారని ఆయన గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి తండ్రి ముఖ్యమంత్రి అయ్యాక 36 ఎకరాల్లో భవనాన్ని ఎలా నిర్మించారో చెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News