venkatesh: చిన్నప్పుడే నాకు వెంకీతో చేసే ఛాన్స్ వచ్చింది: వరుణ్ తేజ్

  • వెంకీ కొడుకుగా చేసే ఛాన్స్ వచ్చింది
  • తమ్ముడిగా చేసే అవకాశం చేజారింది
  • వెంకీతో చేయాలనే కోరిక నెరవేరింది      

వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా దర్శకుడు అనిల్ రావిపూడి 'ఎఫ్ 2' సినిమాను రూపొందించాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చాడు. నా చిన్నప్పుడే వెంకటేశ్ సినిమాలో చేసే ఛాన్స్ వచ్చింది. 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' సినిమాలో వెంకటేశ్ కొడుకుగా చేసే అవకాశం వచ్చిందిగానీ చేయలేకపోయాను.

ఆ తరువాత వెంకటేశ్ హీరోగా చేసిన 'వాసు' సినిమాలో ఆయన తమ్ముడిగా చేసే అవకాశం కూడా వచ్చింది. అయితే నేను అప్పుడు బాగా లావుగా ఉండటం వలన ఆ ఛాన్స్ చేజారింది. అప్పటి నుంచి వెంకటేశ్ తో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తూనే వున్నాను. అందువలన ఈ సినిమాలో ఒక హీరో వెంకీ అనగానే మిగతా విషయాలు అడక్కుండానే ఓకే చెప్పేశాను. వెంకటేశ్ తో సినిమా అంటే ఇకముందు కూడా అలాగే చేస్తాను" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News