CHATTISGAERGH: చెరువులో చనిపోయిన మొసలి.. కన్నీటితో అంత్యక్రియలు జరిపిన గ్రామస్తులు!

  • ఛత్తీస్ గఢ్ లోని మొహితారాలో ఘటన
  • మొసలికి గంగారాం అని పేరుపెట్టిన గ్రామస్తులు
  • అనారోగ్యంతో చనిపోయిన మొసలి

మొసళ్లను దూరం నుంచి చూస్తేనే చాలా మంది హడలిపోతారు. కానీ ఓ ఊరిలో మాత్రం మొసలి చనిపోయిందని తెలుసుకున్న గ్రామస్తులు తీవ్రంగా విలపించారు. దానికి మనుషులకు చేసినట్లే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విచిత్ర ఘటన ఛత్తీస్ గఢ్ లోని మొహితారా గ్రామంలో చోటుచేసుకుంది.

మొహితారా గ్రామంలోని చెరువులో ఓ మొసలి గత 100 సంవత్సరాలుగా ఉండేది. 3.4 మీటర్ల పొడవు, 250 కిలోల బరువున్న ఈ మొసలి మనుషులకు  హాని కలిగించేది కాదు. దీంతో స్థానికులంతా ఈ మొసలిని గంగారాం అని ముద్దుగా పిలిచేవారు. పూజలు నిర్వహించేవారు అయితే ఇటీవల అనారోగ్యానికి గురైన ఈ మొసలి ప్రాణాలు కోల్పోయింది.

దీంతో గ్రామస్తులంతా తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు. తమ కుటుంబంలో ఒకరు చనిపోయినట్లే భావించి ఘనంగా అంత్యక్రియలు చేశారు. దీనికి త్వరలోనే స్మారకాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో రావడంతో విషయం వైరల్ గా మారింది.

More Telugu News