Boyapati Sreenu: ఈ సినిమాలో చెర్రీ ఐరన్ మ్యాన్‌లా కనిపిస్తాడు: బోయపాటి

  • అజర్‌బైజాన్ సీన్స్ బాగా నచ్చుతాయి
  • పాత్రకు తగ్గట్టు దేహదారుఢ్యం
  • కర్త కర్మ క్రియ అన్నీ చరణే

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కైరా అద్వాని జంటగా నటించిన చిత్రం ‘వినయ విధేయ రామ’. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ ప్రతి నాయకుడిగా నటించారు. ప్రశాంత్, స్నేహ, ఆర్యన్ రాజేష్ తదితరులు కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం రేపు విడుదల కానుంది.

ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మీడియాతో మాట్లాడుతూ.. ఈ చిత్రంలో యాక్షన్ దృశ్యాలు వేటికవే ప్రత్యేకంగా ఉంటాయని తెలిపారు. అజర్‌బైజాన్‌లో తెరకెక్కించిన పోరాట ఘట్టం అభిమానులకు బాగా నచ్చుతుందని తెలిపారు. రామ్ చరణ్ తన పాత్రకు తగ్గట్టు దేహదారుడ్యాన్ని మార్చుకున్నాడని బోయపాటి తెలిపారు. ఈ చిత్రంలో చెర్రీ ఐరన్ మ్యాన్‌లా కనిపిస్తాడని.. ఈ చిత్రానికి కర్త కర్మ క్రియ అన్నీ ఆయనేనని తెలిపారు. 

More Telugu News