Bollywood: ముగ్గురు స్టార్స్ కలయిక.. సంజయ్ దత్ తో చిరంజీవి, రామ్ చరణ్ ఫొటో ఇది!

  • ఫొటోలను పోస్ట్ చేసిన రామ్ చరణ్ భార్య ఉపాసన 
  • ఓ ఈవెంట్ లో కలిసిన ముగ్గురూ 
  • 'గుర్తుండిపోయే ఓ సాయంత్రం' అంటూ కామెంట్ 

బాలీవుడ్ అగ్రనటుడు సంజయ్ దత్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఉన్న ఓ చిత్రం హాట్ టాపిక్ గా మారింది. ఓ ఈవెంట్ లో ఈ ముగ్గురూ కలిశారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురూ కలిసి దిగిన చిత్రాలను రామ్ చరణ్ భార్య ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సంజయ్ దత్ భాయ్ తో రామ్ చరణ్ సంభాషిస్తున్నారని, ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ సాయంత్రం అని ఉపాసన తన పోస్ట్ లో పేర్కొన్నారు.

More Telugu News