homosexuality: స్వలింగ సంపర్కులు, వ్యభిచారులకు సైన్యంలో స్థానం లేదు: ఆర్మీ చీఫ్ రావత్

  • స్వలింగ సంపర్కం విషయంలో సైన్యానికి సొంత చట్టాలు ఉన్నాయి
  • మన దేశ సైన్యం సంప్రదాయబద్ధమైనది
  • స్వలింగ సంపర్కులను అనుమతించే ప్రసక్తే లేదు

భారత సైన్యానికి సంబంధించి ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు వార్షిక ప్రెస్ కాన్ఫరెన్స్ ను ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా స్వలింగ సంపర్కం నేరం కాదు అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించాలంటూ మీడియా ఆయనను కోరింది. దీనికి సమాధానంగా ఆయన ఆర్మీ సిద్ధాంతాలను స్పష్టంగా తెలియబరిచారు.

'దేశ చట్టాలకు మేం అతీతులం కాదు. కానీ స్వలింగ సంపర్కం విషయంలో ఆర్మీకి సొంత చట్టాలు ఉన్నాయి. స్వలింగ సంపర్కానికి సైన్యంలో స్థానం లేదు. మన దేశ సైన్యం సంప్రదాయబద్ధమైనది. స్వలింగ సంపర్కులను, వ్యభిచారులను సైన్యంలోకి అనుమతించే ప్రసక్తే లేదు. కొన్ని విషయాలలో సైన్యం విధానాలు వేరేగా ఉంటాయి' అని తెలిపారు.

More Telugu News