team india: ఇండియాలో ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్ విడుదల.. వైజాగ్ లో టీ20, హైదరాబాద్ లో వన్డే

  • ఫిబ్రవరి 24 నుంచి మార్చి 13 వరకు ఆస్ట్రేలియా పర్యటన
  • రెండు టీ20లు, ఐదు వన్డేలు
  • షెడ్యూల్ ను విడుదల చేసిన బీసీసీఐ

ఫిబ్రవరి 24 నుంచి మార్చి 13 వరకు ఇండియాలో ఆస్ట్రేలియా క్రికెట్ పర్యటించనుంది. ఈ టూర్ లో భాగంగా భారత్-ఆసీస్ ల మధ్య రెండు టీ20లు, ఐదు వన్డేలు జరగనున్నాయి. ఇందులో ఒక టీ20 విశాఖపట్నంలో, ఒక వన్డే హైదరాబాదులో జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ ప్రకటించింది.

టీ20 షెడ్యూల్:
ఫిబ్రవరి 24 - తొలి టీ20 - బెంగళూరు
ఫిబ్రవరి 27 - రెండో టీ20 - విశాఖపట్నం

వన్డే షెడ్యూల్:
మార్చి 2 - తొలి వన్డే - హైదరాబాద్
మార్చి 5 - రెండో వన్డే - నాగపూర్
మార్చి 8 - మూడో వన్డే - రాంచీ
మార్చి 10 - నాలుగో వన్డే - మొహాలీ
మార్చి 13 - ఐదో వన్డే - ఢిల్లీ

More Telugu News