ఫ్లిప్ కార్ట్ లో నాలుగు రోజుల పాటు 'నోకియా డేస్' సేల్

Thu, Jan 10, 2019, 01:29 PM
  • ఈరోజు నుండి 13వ తేదీ వరకు సేల్
  • నోకియా 6.1 ప్లస్, నోకియా 5.1 ప్లస్ స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్
  • యాక్సిస్ బ్యాంకు కార్డులపై అదనంగా 5% డిస్కౌంట్
నోకియా బ్రాండ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వినియోగదారుల కోసం ఆన్ లైన్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సంస్థ ఈరోజు నుండి 13వ తేదీ వరకు 'నోకియా డేస్' పేరుతో సేల్ ని నిర్వహిస్తోంది. ఈ నాలుగు రోజుల సేల్ లో భాగంగా నోకియా 6.1 ప్లస్, నోకియా 5.1 ప్లస్ స్మార్ట్ ఫోన్లపై రూ.1000 డిస్కౌంట్ తో పాటు అదనంగా యాక్సిస్ బ్యాంకు కార్డులపై 5% డిస్కౌంట్ ని పొందవచ్చు. ఈ సేల్ లో భాగంగా నోకియా 6.1 ప్లస్ స్మార్ట్ ఫోన్ రూ.14,999 ధరకి లభించనుండగా, నోకియా 5.1 ప్లస్ స్మార్ట్ ఫోన్ రూ.9,999 ధరకి లభించనుంది. ఆకట్టుకునే ఫీచర్లు ఉన్న ఈ రెండు స్మార్ట్ ఫోన్లపై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha