kcr: కేసీఆర్ ను కలిసిన పువ్వాడ అజయ్ కుమార్

  • సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ధన్యవాదాలు తెలిపిన పువ్వాడ
  • ఈ ప్రాజెక్టుతో సుమారు 6.75 లక్షల ఎకరాలకు సాగునీరు
  • జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఖమ్మం టీఆర్ఎస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా సీతారామ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల సాధనకు కృషి చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మీడియాతో పువ్వాడ అజయ్ మాట్లాడుతూ, సీతారామ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్ జిల్లాల్లో సుమారు 6.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. వచ్చే జూన్ నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.

More Telugu News