AAp: ఈ బిల్లు ఆమోదం పొందితే ఆర్ఎస్ఎస్ కుట్రకు దేశం మూల్యం చెల్లించాల్సిందే: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్

  • రిజర్వేషన్లు పూర్తిగా ఎత్తివేసే ప్రయత్నాలు
  • కుట్రలో భాగంగానే ఈ బిల్లు తెచ్చేందుకు యత్నం
  • దేశ రాజధాని ఢిల్లీ అయితే, బీజేపీకి మాత్రం నాగపూర్

భారతదేశానికి రాజధాని ఢిల్లీ అయితే, బీజేపీకి మాత్రం నాగపూర్ రాజధాని అన్న విషయం ప్రజలందరికీ తెలుసని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ విమర్శించారు. ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్ల బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తివేయడానికే ఈ ప్రయత్నాలని, వారి దీర్ఘకాలిక కుట్రలో భాగంగానే ఈ బిల్లును తీసుకువచ్చే యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

ఈ బిల్లు ఆమోదం పొందితే ఆర్ఎస్ఎస్ కుట్రకు దేశం మూల్యం చెల్లించాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎస్సీలు, అణగారిన వర్గాలకు బీజేపీ వ్యతిరేకమని, ఇటీవల కాలంలో జరిగిన వాళ్ల ముఖ్యమంత్రుల ఎంపికే ఇందుకు నిదర్శనమని అన్నారు. గుజరాత్, హరియాణా, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఏ వర్గానికి చెందిన వారని ప్రశ్నించారు.

More Telugu News