Shajahan: మా మసీదులో మహిళలపై ఎలాంటి ఆంక్షలూ లేవు: ముస్లిం జమాత్ అధ్యక్షుడు షాజహాన్

  • కొబ్బరికాయలు కూడా కొట్టొచ్చు
  • హిందూ, ముస్లిం భేదం లేదు
  • వావర్ మసీదుగా ప్రసిద్ధి

మసీదులోకి ప్రవేశిస్తున్న ముగ్గురు మహిళలను కేరళలోని కొళింజంపర పోలీసులు మంగళవారం అరెస్ట్ చేయడంతో వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. అరెస్టైన మహిళలను తమిళనాడులోని హిందూ మక్కల్ కట్చి సంస్థకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనపై తాజాగా తిరువనంతపురాని కి చెందిన మహల్ల ముస్లిం జమాత్ అధ్యక్షుడు పీహెచ్ షాజహాన్ స్పందించారు.

ఎరుమిలి నాయనార్ మసీదులో మహిళల ప్రవేశంపై ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. హిందూ దేవాలయాలలాగే తమ మసీదులో కూడా కొబ్బరి కాయలు కొట్టొచ్చని షాజహాన్ తెలిపారు. హిందూ, ముస్లిం భేదం లేకుండా అందరినీ తమ మసీదులోకి ఆహ్వానిస్తామన్నారు. ఈ మసీదును శబరిమలకు వెళ్లే భక్తులు తప్పని సరిగా దర్శించుకుంటారు. దీంతో ఈ మసీదు వావర్ మసీదుగా ప్రసిద్ధి చెందింది.

More Telugu News