NTR: మా తాతయ్య ఎన్టీఆర్ గురించి తెలియని వాస్తవాలను ఈ చిత్రం ద్వారా తెలుసుకున్నా: నందమూరి సుహాసిని

  • ఈ సినిమా బాగా చిత్రీకరించారు
  • నాన్నగారి పాత్రలో కల్యాణ్ రామ్ నటన అద్భుతం 
  • క్రిష్ గారి డైరెక్షన్ అమోఘం

తమ తాతయ్య ఎన్టీఆర్ గురించి తెలియని వాస్తవాలను ‘యన్.టి.ఆర్’ తొలి భాగం ‘కథానాయకుడు’ ద్వారా తెలుసుకున్నానని ఆయన మనవరాలు నందమూరి సుహాసిని చెప్పారు. ఈరోజు విడుదలైన ‘యన్.టి.ఆర్’ చిత్రాన్ని హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో బాలకృష్ణ, ఆయన కుటుంబసభ్యులు చూశారు. అనంతరం, మీడియాతో సుహాసిని మాట్లాడుతూ, ‘ఈ సినిమా బాగా చిత్రీకరించారు. నాన్నగారి పాత్రలో కల్యాణ్ రామ్ చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో నటీనటులందరూ బాగా చేశారు. క్రిష్ గారి డైరెక్షన్ అద్భుతం..అమోఘం. ప్రేక్షకులందరూ ఈ సినిమా చూసి ఈ చిత్ర విజయానికి తోడ్పడాలి. ఈ చిత్రం రెండో భాగం కోసం ఎదురుచూస్తున్నాను. రేపు రిలీజ్ అయినా థియేటర్స్ కు వెళ్లిపోతాం’ అంటూ ఆసక్తిని కనబరిచారు.

More Telugu News