lawrence: షూటింగ్ పూర్తిచేసుకున్న 'కాంచన 3'

  • లారెన్స్ నుంచి 'కాంచన 3'
  • ప్రతినాయకుడిగా కబీర్ దుహాన్ 
  • వేసవి సెలవుల్లో విడుదల    

హారర్ థ్రిల్లర్ సినిమాల దర్శకుడిగా లారెన్స్ మంచి మార్కులు కొట్టేశాడు. ఆ మధ్య వచ్చిన 'కాంచన 2' కూడా రికార్డుస్థాయి వసూళ్లతో భారీ విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి అలాంటి సినిమాతో లారెన్స్ ఎప్పుడు వస్తాడా అని హారర్ చిత్రాల ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'కాంచన 3' సినిమాను లారెన్స్ సెట్స్ పైకి తీసుకెళ్లాడు.

ఈ సినిమాలో వేదిక .. నిక్కీ తంబోలి ఆయన జోడీ కట్టారు. తాజాగా ఆ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. షూటింగ్ పూర్తయిన సందర్భంగా లారెన్స్ .. వేదిక .. నిక్కీ కేక్ కట్ చేసి సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లారెన్స్ నిర్మాతగాను వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో 'కబీర్ దుహాన్' ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, వేసవి సెలవుల్లో తమిళ.. తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. 

More Telugu News