MIM: ఈబీసీ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్

  • ఇది కుట్ర పూరితమైన బిల్లు..ఇది రాజ్యాంగ విరుద్ధం
  • అగ్రవర్ణాలు వెనుకబడి ఉన్నారన్న గణాంకాలు లేవు
  • కోర్టులో ఈబీసీ బిల్లుకు భంగపాటు తప్పదు

ఈబీసీ బిల్లును వ్యతిరేకిస్తున్నామని, ఇది కుట్ర పూరితమైందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. అగ్రవర్ణాల పేదలకు పది శాతం రిజర్వేషన్ల బిల్లుపై లోక్ సభలో ఈరోజు చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈబీసీ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని అవమానించడమేనని అన్నారు. అగ్రవర్ణాలు వెనుకబడి ఉన్నారన్న గణాంకాలు కేంద్రం దగ్గర లేవని, కోర్టులో ఈబీసీ బిల్లుకు భంగపాటు తప్పదని అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా వెనుకబడిన వారిని గుర్తించే విధానం ఉందా? అని ప్రశ్నించిన ఆయన, దేశంలో అత్యంత పేదలుగా ముస్లింలు ఉన్నారని అన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా అసదుద్దీన్ ప్రస్తావించారు. 

More Telugu News