Yanamala: రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తే.. న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదు: సుప్రీం తీర్పుపై యనమల

  • మోదీ ప్రభుత్వానికి చెంపపెట్టు
  • దర్యాప్తు సంస్థలను సొంతానికి వాడుకున్నారు
  • వ్యక్తిగత స్వేచ్ఛను హరించాలని చూస్తే ఊరుకోరు

నేడు అలోక్ వర్మ కేసు విషయమై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఆయనకు తిరిగి సీబీఐ డైరెక్టరుగా బాధ్యతలు అప్పగించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీనిపై స్పందించిన ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీం తీర్పు మోదీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తే.. న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదన్నారు.

మోదీ సొంతానికి దర్యాప్తు సంస్థలను వాడుకున్నారని యనమల ఆరోపించారు. నాడు తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకించి.. నేడు ఈబీసీలపై కపట ప్రేమ చూపుతున్నారని.. దీని వెనుక రాజకీయ రహస్యమేంటని ప్రశ్నించారు. రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది.. రైతు రుణమాఫీ అంశాన్ని దృష్టి మరల్చేందుకేనని యనమల ఆరోపించారు. వ్యక్తిగత స్వేచ్ఛను మోదీ ప్రభుత్వం హరించాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు.  

More Telugu News