Virat Kohli: ఆసీస్ గడ్డపై అరుదైన రికార్డ్ సాధించిన కోహ్లీ సేనకు బీసీసీఐ నజరానా

  • నాలుగు టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం
  • గతంలో టెస్ట్ సిరీస్‌ను గెలిచింది లేదు
  • ఒక సిరీస్‌ను డ్రా చేసిన గంగూలీ సేన

దాదాపు 70 ఏళ్ల తరువాత టీమిండియా.. ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపైనే ఓడించి నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆసీస్ గడ్డపై ఇంతకు ముందెప్పుడూ భారత్ టెస్ట్ సిరీస్‌ను గెలవలేదు. గంగూలీ సేన మాత్రం ఒక సిరీస్‌ను డ్రా చేసింది.

ఈ అరుదైన విజయాన్ని సాధించిన కోహ్లీసేనకు బీసీసీఐ భారీ నజరానాను ప్రకటించింది. టెస్టు జట్టులో ఆడిన ఆటగాళ్లందరికీ ఒక్కొక్కరికీ ఒక్కో టెస్టుకి రూ.15 లక్షలను నజరానాగా ప్రకటించింది. నాలుగు మ్యాచ్‌లు ఆడిన వారికి రూ.60 లక్షలు ఇవ్వనుంది. అలాగే రిజర్వ్ ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్ కు 7.5 లక్షల చొప్పున, కోచ్‌లకు ఒక్కొక్కరికీ రూ.25 లక్షలను నజరానాగా బీసీసీఐ అందించనుంది. అలాగే సహాయక సిబ్బందికి వారి ప్రొఫెషనల్ ఫీజుకు సమానంగా బోనస్ అందించనుంది.

More Telugu News