స్మార్ట్ ఫోన్: ఆనర్ నుండి ఆకట్టుకునే ఫీచర్లతో మరో స్మార్ట్ ఫోన్!

  • 'ఆనర్ 10 లైట్' ఈనెల 15న విడుదల 
  • రెండు వేరియంట్లలో లభ్యం 
  • ప్రత్యేకంగా విక్రయించనున్న ఫ్లిప్ కార్ట్

హువావే సబ్ బ్రాండ్ సంస్థ ఆనర్ నుండి నూతన స్మార్ట్ ఫోన్ ఈనెల 15న భారత మార్కెట్లో విడుదల కానుంది. 'ఆనర్ 10 లైట్' పేరిట విడుదల కానున్న ఈ ఫోన్ గ్రేడియాన్ బ్లూ, వ్యాలే వైట్, మ్యాజిక్ నైట్ బ్లాక్ అనే మూడు రంగులలో లభ్యం కానుంది. గత సంవత్సరం చైనాలో 4 జీబీ/6 జీబీ అనే రెండు వేరియంట్లలో విడుదలైన ఈ ఫోన్ ధరలు మనదేశంలో వరుసగా సుమారు రూ.14,400 (4 జీబీ), రూ.17,500 (6 జీబీ)గా ఉండే అవకాశం ఉంది. పలు ఆకట్టుకునే ఫీచర్లు ఉన్న ఈ ఫోన్లో అధునాతన కిరిన్ 710 ప్రాసెసర్ ని అమర్చారు. కాగా, ఫ్లిప్ కార్ట్ సంస్థ ప్రత్యేకంగా ఈ ఫోన్ ని విక్రయించనుంది.

ప్రత్యేకతలు:

  • 6.21" హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే (1080 x 2340 పిక్సల్స్)
  • కిరిన్ 710 ప్రాసెసర్
  • 4 జీబీ/ 6 జీబీ  ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 9.0పై ఆపరేటింగ్ సిస్టం
  • 13/2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
  • 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • ఫింగర్ ప్రింట్ సెన్సార్
  • 3400 ఎంఏహెచ్ బ్యాటరీ

More Telugu News