IMF: ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గా తొలి మహిళ.. బాధ్యతలు స్వీకరించిన గీతా గోపీనాథ్!

  • హార్వర్డ్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న గీత
  • గీత నియామకంపై ఐఎంఎఫ్ చీఫ్ లగార్డే హర్షం
  • గౌరవంగా భావిస్తున్నానన్న గీతా గోపీనాథ్

అమెరికాలోని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్)లో చీఫ్ ఎకనమిస్ట్ పదవిని తొలిసారి ఓ మహిళ అలంకరించారు. భారత్ లోని తమిళనాడుకు చెందిన గీతా గోపీనాథ్ ఐఎంఎఫ్ లో చీఫ్ ఎకనమిస్ట్ పదవిని చేపట్టి రికార్డు సృష్టించారు. హార్వర్డ్‌ యూనివర్సిటీలో గీత ఆర్థిక శాస్త్రం ప్రొఫెసర్‌ గా పనిచేస్తున్నారు.

గీతా గోపీనాథ్‌ను ఐఎంఎఫ్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌గా నియమించుకుంటామని గతేడాది అక్టోబరు 1నే  ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టీన్‌ లగార్డే ప్రకటించారు. గీత ప్రపంచంలోని అత్యుత్తమ ఆర్థికవేత్తల్లో ఒకరని ప్రశంసించారు. ఆమె నియామకంపై హర్షం వ్యక్తం చేశారు. గీతా గోపీనాథ్‌ ఐఎంఎఫ్‌కు 11వ చీఫ్‌ ఎకనమిస్ట్‌.

ఈ సందర్భంగా గీత స్పందిస్తూ.. తనకు ఈ పదవి దక్కడం చాలా అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచీకరణ నుంచి వెనక్కి తగ్గడం, సుంకాలు పెంపు పెద్ద సవాళ్లుగా మారాయని, బహుళజాతి సంస్థలకు ఇబ్బందులు పెరిగాయని గీత అభిప్రాయపడ్డారు.

More Telugu News