Vizag: జగన్ పై దాడి కేసు... కోర్టుకు హాజరుకాని ఎన్ఐఏ లాయర్!

  • విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై దాడి
  • విచారణను ఎన్ఐఏకు అప్పగించిన హైకోర్టు
  • ఇంకా అధికారిక సమాచారం లేదన్న న్యాయవాది సలీమ్

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసును హైకోర్టు ఎన్ఐఏకు అప్పగిస్తూ, ఆదేశాలు జారీ చేసినా, తమకు అధికారికంగా ఎలాంటి నోటీసూ అందలేదని నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాది సలీమ్ వెల్లడించారు. నిన్న నిందితుడి తరఫున దాఖలైన బెయిల్ పిటిషన్ పై కోర్టులో విచారణ సాగగా, ఎన్ఐఏ తరఫు న్యాయవాది హాజరు కాలేదు. దీంతో విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. ఈ కేసులో విచారణను ఎన్ఐఏకు అప్పగించారా? లేదా? అన్న విషయమై అయోమయం నెలకొని వుందని సలీమ్ వ్యాఖ్యానించారు. కాగా, శ్రీనివాసరావుకు బెయిల్ ఇవ్వాలంటే, ఎన్ఐఏ అభిప్రాయం కోరడం తప్పనిసరి.

More Telugu News