Sankranti: పల్లెకు పోదాం చలో చలో... కిక్కిరిసిన రైళ్లు, బస్సులు!

  • హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు ప్రయాణం మొదలు
  • జనరల్ బోగీల్లో ఎక్కేందుకు తప్పని తిప్పలు
  • రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు

సంక్రాంతికి హైదరాబాద్ నగరం నుంచి స్వగ్రామాలకు ప్రయాణం మొదలైంది. విద్యార్థులకు సెలవులు ప్రారంభం కావడంతో వారిని తీసుకుని వేలాది మంది సొంత గ్రామాలకు బయలుదేరారు. రెండు రోజుల నుంచే ప్రయాణాలు ప్రారంభంకాగా, నిన్న సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు కిటకిటలాడాయి. జనరల్ బోగీల్లోకి ఎక్కేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా చిన్న పిల్లలతో వచ్చిన వారు కిక్కిరిసిన బోగీల్లోకి ఎక్కలేక అల్లాడిపోయారు. మరోవైపు ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ బస్టాండ్లలోనూ రద్దీ నెలకొంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను నడుపుతామని ఆర్టీసీ పేర్కొంది. కాగా, ఈ నెల 10వ తేదీ నుంచి రిజర్వేషన్ సౌకర్యం ఉన్న అన్ని బస్సుల్లోనూ సీట్లు నిండుకున్నాయి. రిజర్వేషన్ సౌకర్యం కల్పించిన ప్రత్యేక బస్సుల పరిస్థితి కూడా దాదాపు ఇంతే. 

More Telugu News