upper caste: అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు... నియమ నిబంధనలు ఇవే!

  • వార్షిక ఆదాయం రూ. 8 లక్షలకు మించరాదు
  • 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి ఉండాలి
  • నివాసం వెయ్యి చ.అడుగుల కంటే తక్కువ ఉండాలి

అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ మోదీ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఈరోజు మధ్యాహ్నం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర లభించింది. దీనికి సబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును రేపు లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు.

10 శాతం రిజర్వేషన్లు పొందే కుటుంబాలకు నిబంధనలు ఇవే:

  • సంవత్సర ఆదాయం రూ. 8 లక్షల కంటే తక్కువగా ఉండాలి. 
  • వ్యవసాయ భూమి 5 ఎకరాల కంటే తక్కువగా ఉండాలి.
  • సొంత ఇల్లు 1,000 చదరపు అడుగుల కంటే తక్కువలో ఉండాలి.
  • మునిసిపాలిటీ పరిధిలో వుండే నివాస స్థలం అయితే కనుక 109 చదరపు గజాల లోపులో ఉండాలి. 
  • మున్సిపాలిటీయేతర పరిధిలో అయితే కనుక 200 చదరపు గజాల లోపులో ఉండాలి. 

More Telugu News