ఖమ్మం జిల్లాలో ఓటమితో ముఖ్యమంత్రి కేసీఆర్ గుండెల్లో బాధ నెలకొంది!: తుమ్మల ఆవేదన

- స్వార్థరాజకీయాలు, కుట్రలతో ఓడిపోయాం
- ఇకపై జరగాల్సిన విషయాన్ని చూడండి
- అశ్వారావుపేటలో మీడియాతో మాట్లాడిన నేత
రాజకీయంగా తనకు జన్మనిచ్చిన సత్తుపల్లిలో గెలుస్తామని ఆశపడ్డామని తుమ్మల తెలిపారు. అశ్వారావుపేట అసలు గెలవాల్సిన స్థానమనీ, ఇలాంటి చోట స్వార్థ రాజకీయాలతో ఓటమి పాలవడం బాధ కలిగించిందని వ్యాఖ్యానించారు. ఇప్పటిదాకా జరిగింది మనసులో పెట్టుకోకుండా జరగాల్సింది చూడాలని కార్యకర్తలకు సూచించారు.
ఖమ్మం జిల్లాకు కేసీఆర్ చాలా ప్రాధాన్యత ఇచ్చారనీ, 800 మెగావాట్లతో కేటీపీఎస్‌ను, 1200 మెగావాట్లతో భద్రాద్రి పవర్ ప్లాంట్‌ను కేటాయించారని గుర్తుచేశారు. ఈ రెండు యూనిట్ల నిర్మాణం ఇప్పటికే తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు. రాబోయే పంచాయతీ ఎన్నికలకు గ్రామ నాయకులంతా ఏకమై సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని సూచించారు.