Chandrababu: జగన్ పై దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం.. హోం మంత్రికి లేఖ రాయాలని నిర్ణయం

  • ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • రాజ్‌నాథ్‌కు లేఖ రాయనున్న చంద్రబాబు
  • పోలీసులు, న్యాయ నిపుణుల నివేదిక కోరిన సీఎం

విశాఖపట్టణం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయడంపై అభ్యంతరం తెలపాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ విషయంలో నిరసన వ్యక్తం చేస్తూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి, లేదంటే హోంమంత్రి స్వయంగా రాజ్‌నాథ్‌కు లేఖ రాస్తే బాగుంటుందని అధికారులు సూచించారు. లేఖలో ఎటువంటి విషయాలను ప్రస్తావించాలనే విషయంలో తగిన సూచనలతో నివేదిక ఇవ్వాలని పోలీసు అధికారులను, న్యాయ నిపుణులను చంద్రబాబు కోరారు.

More Telugu News