Loksatta: దేశంలో రాజకీయం, ప్రజాస్వామ్య విలువలు దిగజారిపోతున్నాయి: ‘లోక్ సత్తా’ జేపీ

  • ప్రభుత్వ పని తీరు ఏమంత ఆశాజనకంగా లేదు
  • పార్టీలకు ప్రజాప్రయోజనాలు పట్టడం లేదు
  • ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి విపరీతంగా పెరిగింది

దేశంలో రాజకీయం, ప్రజాస్వామ్య విలువలు దిగజారిపోతున్నాయని ‘లోక్ సత్తా’ అధినేత జయప్రకాష్ నారాయణ (జేపీ) ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరు ఏమంత ఆశాజనకంగా లేదని, రాజకీయ ప్రయోజనాలు తప్ప పార్టీలకు ప్రజాప్రయోజనాలు పట్టడం లేదని విమర్శించారు. ప్రపంచంలోని 49 దేశాలతో పోలిస్తే, భారతదేశం చివరి 5 స్థానాల్లో ఒకటిగా ఉందని, మనకున్న అవకాశాలతో పోల్చుకుంటే మొదటి ఐదు స్థానాల్లో మన దేశం ఉండాలని అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులను చూస్తుంటే ప్రభుత్వానికి వణుకు పుడుతోందని, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి విపరీతంగా పెరిగిందని, లంచం లేకుండా ఒక్కపనీ అవ్వడం లేదని జేపీ విమర్శించారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో పౌరసేవల చట్టం లేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే రాజకీయం కావాలని ఆకాంక్షించారు. నిజమైన ఫెడరలిజం దేశంలో రావాలని, ఫ్యూడల్ వ్యవస్థ నాశనం కావాలని కోరారు.

More Telugu News