vice president: కష్టపడి, ఇష్టపడి పనిచేస్తే విజయం తథ్యం: వెంకయ్యనాయుడు

  • జన్మభూమి కోసమే స్వర్ణభారత్ ట్రస్టు ఏర్పాటు
  • పద్దెనిమిదేళ్లుగా సేవలందిస్తున్నాం
  • నా పిల్లలు సమాజసేవ చేసేందుకు ముందుకొచ్చారు

ఆంధ్రప్రదేశ్‌ లోని కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్టు వార్షికోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నోబెల్‌ గ్రహీత కైలాస్‌ సత్యార్థి, డీఆర్‌డీఓ చైర్మన్‌ జి.సతీష్‌రెడ్డి వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జన్మభూమికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే స్వర్ణభారత్ ట్రస్టు ను నాడు ప్రారంభించామని, పద్దెనిమిదేళ్లుగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్టు చెప్పారు. తన పిల్లలు రాజకీయ వారసత్వం కోసం కాకుండా సమాజసేవ చేసేందుకు ముందుకొచ్చారని, కష్టపడి, ఇష్టపడి పనిచేస్తే విజయం తథ్యమని చెప్పారు.

బాలల హక్కుల కోసం కైలాస్ సత్యార్థి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. కైలాశ్ సత్యార్థి ఇక్కడకు రావడం సంతోషకరమని అన్నారు. ఈ సందర్భంగా డీఆర్ డీఏ చైర్మన్ సతీశ్ రెడ్డి గురించి ఆయన ప్రస్తావిస్తూ, సతీశ్ ప్రతిభ చూసి ఆయన కలాం లాంటి వారవుతారని ఎప్పుడో చెప్పానని గుర్తుచేసుకున్నారు. రక్షణ పరిశోధన సంస్థకు తెలుగు వ్యక్తి నేతృత్వం వహించడం గర్వకారణమని అన్నారు.

అలాంటివారు జారిపడటం ఖాయం

మనమాట, హుందాతనం, నడవడికను అనుసరించే మనకు గౌరవం లభిస్తుందని చెప్పారు. ఈ మధ్య కాలంలో కొందరు నాయకులకు నోరుజారడం అలవాటైందని, అలాంటి వారు జారిపడటం ఖాయమని సూచించారు.

More Telugu News