Sun: తొలుత వరుణుడు, ఆపై సూర్యుడు... ఆసీస్ ను ఆదుకున్నారు!

  • లంచ్ వరకూ వర్షం కారణంగా అడ్డంకి
  • ఆపై ఫాలో ఆన్ ఆడుతుంటే తగ్గిపోయిన సూర్యకాంతి
  • నాలుగో రోజు ఆటను నిలిపివేసిన అంపైర్లు

సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలుత వరుణుడు, ఆపై సూర్యుడు ఆస్ట్రేలియాను ఆదుకున్నారు. ఆట నాలుగోరోజు లంచ్ సమయం వరకూ వర్షం పడుతూ ఉండటంతో అసలు బ్యాటింగే ప్రారంభం కాలేదు. ఆపై గంటన్నర వ్యవధిలోనే ఆస్ట్రేలియా జట్టు 300 పరుగులకు ఆలౌట్ అయి, భారత స్కోరు కన్నా 322 పరుగులు వెనుకబడగా, ఆ వెంటనే ఫాలోఆన్ ఆడించాలని భారత్ నిర్ణయించింది.

దీంతో మార్కస్ హాసిర్, ఖావాజాలు ఆసీస్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. ఆట నాలుగు ఓవర్లపాటు సాగి, ఆసీస్ స్కోరు 6 పరుగులకు చేరిన వేళ, ఆటకు తగినంత సూర్యకాంతి లేని కారణంగా ఎంపైర్లు ఆటను నిలిపివేస్తున్నట్టు వెల్లడించారు. ఆపై సూర్యుడు కనిపించలేదు. దీంతో మరొక్క బంతి కూడా పడకుండానే నాలుగో రోజు ఆట ముగిసిపోయింది. ఇక రేపు ఆట ఆఖరి రోజు కాగా, ఆసీస్ ఆటగాళ్లు నిలిస్తే, మ్యాచ్ డ్రా అవుతుంది.

More Telugu News