vijaya malya: మాల్యాను ‘పారిపోయిన ఆర్థిక నేరస్తుడు’గా ప్రకటించిన కోర్టు

  • ఈడీ గతంలో ఓ పిటిషన్ దాఖలు
  • ఈరోజు విచారణ జరిపిన పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు 
  • మాల్యాను పారిపోయిన ఆర్థిక నేరస్తుడిగా ప్రకటన

భారత్ లో బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలు ఎగ్గొట్టి లండన్ లో తలదాచుకుంటున్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాను ‘పారిపోయిన ఆర్థిక నేరస్తుడు’గా ప్రకటించారు. ఈ మేరకు ముంబయిలోని పీఎంఎల్ఏ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు నిచ్చింది. ఆర్థిక నేరగాళ్ల చట్టం 2018 ప్రకారం మాల్యాకు ‘పారిపోయిన ఆర్థిక నేరస్తుడు’ అనే ట్యాగ్ ఇవ్వాలని కోరుతూ పీఎంఎల్ ఏ న్యాయస్థానంలో ఈడీ గతంలో ఓ పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్ పై ఈరోజు విచారణ జరిపిన కోర్టు, మాల్యాకు ఈ ట్యాగ్ ను ఇస్తూ ప్రకటించింది. కాగా, తనను పారిపోయిన ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించాలన్న విచారణ ప్రక్రియపై స్టే విధించాలని సుప్రీంకోర్టులో మాల్యా గత నెలలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం అందుకు నిరాకరించింది. కాగా, లండన్ లో తలదాచుకుంటున్న మల్యాను భారత్ కు అప్పగించాలని వెస్ట్ మినిస్టర్ కోర్టు గత నెలలో తీర్పు వెలువరించింది. బ్రిటన్ నుంచి మాల్యాను భారత్ కు తీసుకొచ్చిన అనంతరం ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలుకు తరలిస్తారని సమాచారం.

More Telugu News