Chandrababu: కోడికత్తి కేసును ఎన్ఐఏకి అప్పగించడం విచిత్రంగా ఉంది: చంద్రబాబు

  • తెలుగు రాష్ట్రాల మధ్య మోదీ గొడవలు పెడుతున్నారు
  • కేసీఆర్, జగన్ లను ఉసిగొలుపుతున్నది మోదీనే
  • పార్లమెంటు ఎన్నికల్లో మోదీకి గుణపాఠం తప్పదు

ప్రధాని మోదీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి విమర్శలు గుప్పించారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ, ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టేందుకు మోదీ యత్నిస్తున్నారని మండిపడ్డారు. రెండుగా విడిపోయిన ఏపీ, తెలంగాణలకు సహకరించాల్సింది పోయి... గొడవలు పెడుతున్నారని అన్నారు. ఓవైపు పోలవరం ప్రాజెక్టుకు అవార్డులు ఇస్తారని... మరోవైపు విమర్శలు గుప్పిస్తారని దుయ్యబట్టారు.

నీటి సమస్యలను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం... రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. మోదీ చెప్పే మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని... పార్లమెంటు ఎన్నికల్లో ఆయనకు గుణపాఠం చెబుతారని అన్నారు. కోడికత్తి కేసును కూడా ఎన్ఐఏకు అప్పగించడం విచిత్రంగా ఉందని చెప్పారు. ఏపీలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ చూస్తోందని అన్నారు. తమపైకి కేసీఆర్, జగన్ లను ఉసిగొలుపుతున్నది మోదీనే అని చెప్పారు.

More Telugu News