Andhra Pradesh: సినీ నటుడు శివాజీపై మండిపడ్డ కమెడియన్ పృథ్వీ!

  • ఏపీలో విపక్షాల ఓటు బ్యాంకు గల్లంతుకు యత్నాలు
  • ఆధార్-ఓటర్ కార్డు లింకింగ్ పై సుప్రీంకు వెళతాం
  • శివాజీ మాటలు హుందాగా లేవు

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాల ఓటు బ్యాంకును గల్లంతు చేసేందుకు టీడీపీ నేతలు యత్నిస్తున్నారని ప్రముఖ సినీ నటుడు పృథ్వీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఓటర్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడానికి వైసీపీ కుట్రలు చేయాల్సిన అవసరం లేదని పృథ్వీ స్పష్టం చేశారు. ప్రజాబలం వైసీపీకి పుష్కలంగా ఉందన్నారు. త్వరలోనే ఆధార్-ఓటర్ కార్డు అనుసంధానంపై సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీ మాట్లాడారు.

ఏపీ సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రకు సంబంధించి తన వద్ద ఫైలు ఉందని నటుడు శివాజీ చెప్పడాన్ని పృథ్వీ తప్పుపట్టారు. తన వద్ద కూడా ఓ ఫైలు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. శివాజీ ప్రెస్ మీట్లలో మీసాలు తిప్పుతున్నాడనీ, నా వెంట్రుక కూడా పీకలేరు అని మాట్లాడుతున్నాడనీ, ఇది హుందాతనం కాదని స్పష్టం చేశారు.

సమైక్యాంధ్ర ఉద్యమం, దివాకర్ ట్రావెల్స్ ప్రమాదం సమయంలో శివాజీ మాటలు విని ‘బాబోయ్.. ఇతను మామూలు లీడర్ లాగా లేడు’ అని భావించానని పృథ్వీ అన్నారు. కానీ ఆ తర్వాత తెల్లవారి లేచిన దగ్గర నుంచి టీడీపీ మీటింగుల్లో మాట్లాడుతూ.. చంద్రబాబు నంది అంటే నంది, పంది అంటే పంది అని శివాజీ అంటున్నారని విమర్శించారు. ఏపీలో ఉన్న బోగస్ ఓటర్ల జాబితాను సుప్రీంకోర్టుకు సమర్పించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు

More Telugu News