ram: రామ్ సినిమా కోసం రంగంలోకి దిగిన మణిశర్మ

  • సొంత బ్యానర్లో పూరి జగన్నాథ్ 
  • 'ఇస్మార్ట్ శంకర్' గా రామ్ 
  • హీరోయిన్ గా తెలుగు అమ్మాయి

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. రామ్ కి ఇది 17వ సినిమా కాగా, పూరి జగన్నాథ్ కి ఇది 35వ సినిమా. ఈ ఇద్దరి కాంబినేషన్లో సెట్స్ పైకి వెళ్లనున్న సినిమాకి 'ఇస్మార్ట్ శంకర్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్టులుక్ కూడా వచ్చేసింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా మణిశర్మను ఎంపిక చేసుకున్నారనేది తాజా సమాచారం. గతంలో పూరి .. మణిశర్మ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఘన విజయాలను అందుకున్నాయి. వాటిలో 'పోకిరి'ని ప్రధానంగా చెప్పుకోవచ్చు. అందువలన మణిశర్మ ఎంట్రీ ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. పూరి జగన్నాథ్ సొంత బ్యానర్లో నిర్మితమవుతోన్న ఈ సినిమా ద్వారా తెలుగు హీరోయిన్ పరిచయం కానుంది.

More Telugu News