Maharashtra: కాబోయే ప్రధానుల్లో ఎక్కువ మంది మహారాష్ట్ర వాసులే : సీఎం ఫడ్నవీస్‌

  • ప్రపంచ మరాఠీ సమ్మేళనంలో ఓ ప్రశ్నకు సమాధానం
  • 2050లోపు ఇది జరుగుతుందని వ్యాఖ్య
  • ఇప్పటి వరకు మరాఠావాసులు ఎవరూ లేరు

భవిష్యత్తులో కాబోయే ప్రధానుల్లో ఎక్కువ మంది మహారాష్ట్ర వాసులే ఉంటారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ వ్యాఖ్యానించారు. 2050లోపు ఇది జరిగి తీరుతుందని చెప్పారు. నాగపూర్‌లో శుక్రవారం జరిగిన ప్రపంచ మరాఠీ సమ్మేళనానికి హాజరైన ఆయన ముఖాముఖిలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి ఎవరూ ప్రధాని కాలేదు.

ఈ నేపథ్యంలో ‘2050 కల్లా మహారాష్ట్ర నుంచి ఎవరైనా ప్రధాని మంత్రి అయ్యే అవకాశం ఉందా’ అని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఫడ్నవీస్‌ ఈ విధంగా ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. రాజుల కాలంలో భారత్‌లో ఎక్కువ ప్రాంతాన్ని పాలించింది మహారాష్ట్రీయులేనని గుర్తు చేశారు. 18వ శతాబ్దంలో పాకిస్థాన్‌లోని ఆటోక్‌ను సైతం జయించిన ఘనత మహారాష్ట్ర వాసులదేనన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక అవకాశాలు రాకపోయినా భవిష్యత్తులో ఆ ముచ్చట తీరుతుందని వ్యాఖ్యానించారు.

More Telugu News